హుజూర్​నగర్​పై నిఘా..ఖర్చులపై అబ్జర్వర్ గా బాలకృష్ణన్

హుజూర్​నగర్​పై నిఘా..ఖర్చులపై అబ్జర్వర్ గా బాలకృష్ణన్
  • ఉప ఎన్నిక ఖర్చులపై నజర్​కు అబ్జర్వర్​గా బాలకృష్ణన్​
  • సూర్యాపేట ఎస్పీ బదిలీ.. భూపాలపల్లి ఎస్పీ భాస్కరన్​కు బాధ్యతలు
  • సర్కారు అధికార దుర్వియోగంపై బీజేపీ ఫిర్యాదుతో ఈసీ చర్యలు

న్యూఢిల్లీ, వెలుగు: హుజూర్‌‌నగర్‌‌  ఉప ఎన్నికకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర ఎలక్షన్​ కమిషన్​ స్పందించింది. సూర్యాపేట జిల్లా ఎస్పీ​పై బదిలీ వేటు వేసింది. ఎలక్షన్ల ప్రత్యేక వ్యయ పరిశీలకుడిగా రిటైర్డ్​ ఐఆర్ఎస్​ ఆఫీసర్​ బీఆర్​ బాలకృష్ణన్​ను నియమించింది. ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్​ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతున్నాయని, టీఆర్ఎస్​ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర చీఫ్​ లక్ష్మణ్, మురళీధర్​రావు, వివేక్​ వెంకటస్వామి తదితరులు గురువారం ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంత్రులు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌‌ను అడ్డం పెట్టుకుని డబ్బు పంపిణీ చేస్తున్నారని, సర్పంచ్‌‌ల సంఘం అధ్యక్షుడు భూమన్నపై అక్రమ కేసులు పెట్టారని వారు పేర్కొన్నారు.

బాలకృష్ణన్​ స్ట్రిక్ట్​ ఆఫీసర్‌

బీఆర్ బాలకృష్ణన్ 1983 బ్యాచ్ కుచెందిన ఐఆర్ ఎస్ ఆఫీసర్.. స్ట్రిక్ట్ఆఫీసర్ గా ఆయనకు పేరుంది. పదవీ విరమణకు ముందు బెంగళూరులో
ఇన్ కంటాక్స్ శాఖలో డైరెక్టర్జనరల్(ఇన్వెస్టిగేషన్) గా,అహ్మదాబాద్​లో ఇన్ కంటాక్స్ప్రిన్సిపల్ కమిషనర్(సెంట్రల్) గాపనిచేశారు. ఐటీ అధికారిగా
సిబ్బందిని ట్రైన్ చేసుకోవడంలో,వారిని సమర్థంగా ఉపయోగించుకోవడంలో ఆయనకు మంచిపేరుంది. నోట్ల రద్దు సమయంలోఆయన విస్తృతంగా రెయిడ్స్ చేసికోట్ల రూపాయలను పట్టుకున్నారు.అయితే కర్నాటక కాంగ్రెస్ నేత డీకేశివకుమార్‌ ఇంటిపై రెయిడ్స్  విషయంలో మాత్రం రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు.