
భూకుంభకోణంతో ముడిపడి మున్న మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఏడు గంటలకు పైగా ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసింది.
కొద్దిసేపటిక్రితమే హేమంత్ సోరేన్ తన రాజీనామాను రాజ్ భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణకు సమర్పించారు. నాటకీయ పరిణామాల మధ్య అధికార జేఎంఎం పార్టీ నేతృత్వంలోని సంకీర్నం జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా సీనియర్ నేత చంపై సోరేన్ పేరును ప్రతిపాదించింది. జార్ఖండ్ తదుపరి సీఎంగా చంపై సోరేన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం పదవికి హేమంత్ సోరేన్ రాజీనామా చేశారు. హేమంత్ సోరేన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. అనంతరం హేమంత్ సోరేన్ ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లిన అధికారులు అధికారికంగా అరెస్ట్ చేశారు. జార్ఖండ్ తదుపరి సీఎంగా, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM)పార్టీ శాసనసభాపక్ష నేతగా చంపై సోరేన్ ను ఎన్నుకున్నారు. జార్ఖండ్ కొత్త సీఎం చంపై సోరేన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. JMM సీనియర్ నేత , రవాణా మంత్రి అయిన చంపై సోరేన్ కు మంచి పేరుంది. హేమంత్ సోరేన్ కు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు.
హేమంత్ సోరేన్ ను బుధవారం (జనవరి 31) సెంట్రల్ ఏజెన్సీ (ఈడీ) విచారిచింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన నివాసంలోనే ఉదయం 9 గంటల నుంచి విచారించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈడీ బృందం హేమంత్ సోరేన్ ను ఈడీ అధికారులు విచారించారు. సీఎం సోరేన్ ను ఈడీ ప్రశ్నిస్తున్న సమయంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాంచీలోని సోరేన్ ఇంటిముందు 144 సెక్షన్ విధించారు.