ఒక్కరోజు జ్యుడిషియల్ కస్టడీకి మాజీ సీఎం

ఒక్కరోజు జ్యుడిషియల్ కస్టడీకి మాజీ సీఎం

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు ప్రత్యేక PMLA కోర్టు ఒక రోజు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మనీలాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరేన్ ను నిన్న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ కు ముందు ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరేన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన గవర్నర్ ను కలిసేందుకు రాజ్ భవన్ కు వెళ్లారు. 


మొత్తం 47 మంది జేఎంఎం ఎమ్మెల్యేలు బుధవారం సాయంత్రం (జనవరి 31) గవర్నర్ ను కలిశారు. జార్ఖండ్ రాజకీయ పరిణామాలు, తదుపరి శాసన సభాపక్ష నేతగా చంపై సోరేన్ నామినేట్ చేయాలని గవర్నర్ ను కోరారు. ఈ క్రమంలో సాయంత్రం 5.30 కి జేఎంఎం శాసన సభాపక్ష నేత చంప సోరేన్ తో సమావేశం కానున్నారు.