మాజీ సీఎం సిద్ధరామయ్య డ్యాన్స్ వీడియో వైరల్

మాజీ సీఎం సిద్ధరామయ్య డ్యాన్స్ వీడియో వైరల్

బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ లీడర్ సిద్ధ రామయ్య డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది. సిద్ధ రామయ్య స్వస్థలమైన సిద్దరమణహుండిలో జాతర జరుగుతోంది. ఈ జాతరలో తన చిన్ననాటి స్నేహితులతో కలిసి సిద్ధ రామయ్య డ్యాన్స్ చేశారు. వీర నృత్య అనే ఫోక్ సాంగ్ కి స్టెప్పులేశారు. అనంతరం సిద్ధరామేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కొన్ని రోజుల కిందట మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ట్రైబల్ సాంగ్ కి డ్యాన్స్ చేయగా, చత్తీస్ఘడ్ సీఎం భూపేశ్ బగేల్ కూడా ఓ ఫిల్మ్ సాంగ్ కు స్టెప్పులేసి ఔరా అనిపించారు. 

మరిన్ని వార్తల కోసం:

ఇసుక కోసం రెండు గ్రామాల మధ్య కొట్లాట

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు

RRR రివ్యూ: ఎవ్వరూ తగ్గలే!