కాంగ్రెస్ గూటికి నేతి విద్యాసాగర్!

కాంగ్రెస్ గూటికి నేతి విద్యాసాగర్!
  • కాంగ్రెస్ గూటికి నేతి విద్యాసాగర్!
  • నకిరేకల్ లో మంత్రి హరీశ్ సభకు డుమ్మా
  • బీసీ కోటాలో నల్గొండ స్థానం కోసం ప్రయత్నాలు

నల్గొండ, వెలుగు : శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కాంగ్రెస్​లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొంత కాలంగా బీఆర్ఎస్ లో సైలెంట్​గా ఉంటున్న ఆయన శుక్రవారం నకిరేకల్​లో జరిగిన మంత్రి హారీశ్ రావు ఆశీర్వాద సభకు డుమ్మా కొట్టారు. సభకు రమ్మని మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరినప్పటికీ ఆయన నిరాకరించినట్టు తెలిసింది. కేసీఆర్ ఇచ్చిన ఎమ్మెల్సీ హామీ నెరవేర్చలేదని, పైగా సీఎంను కలిసేందుకు పలు మార్లు ప్రయత్నించినప్పటికీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆయన వారితో చెప్పినట్టు తెలిసింది.

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మళ్లీ పాతగూటికి చేరేందుకు కాంగ్రెస్ లీడర్లతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటే ఆయన కూడా ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సింది. అయితే కాంగ్రెస్​పార్టీలో బీసీ కోటాలో నల్గొండ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. వైఎస్ హయాంలో తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికైన విద్యాసాగర్ ఆ తర్వాత రెండో టర్మ్ కూడా కాంగ్రెస్ నుంచే కొనసాగారు. మూడోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కేసీఆర్​ అవకాశం ఇచ్చారు.