మాజీ మంత్రి బండారు సత్యారాయణ అరెస్టు

మాజీ మంత్రి బండారు సత్యారాయణ అరెస్టు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలోని తన నివాసంలో ఆయనకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. ముందుగా అనకాపల్లి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. అనంతరం బండారును గుంటూరు తరలిస్తున్నారు పోలీసులు. 

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి రోజాపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. బండారు వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా ఆరండల్ పేట్, నగర పాలెం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక కేసు, మంత్రి ఆర్‌కే రోజాపై వ్యాఖ్యలు చేసినందుకు మరో కేసు నమోదు చేశారు పోలీసులు.

బండారుపై 400/2023, 41 (A),  41(B),153, 294, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బండారు సత్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.