చెరుకు రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి : చంద్రశేఖర్​

చెరుకు రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి : చంద్రశేఖర్​

జహీరాబాద్, వెలుగు: మండలంలోని కొత్తూర్ బి గ్రామ సమీపంలో ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు, రైతులకు పెండింగ్​బకాయిలు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి చంద్రశేఖర్​డిమాండ్​ చేశారు. శుక్రవారం ఆయన ట్రైడెంట్ ఫ్యాక్టరీ సందర్శించి కార్మికులు, అధికారుల తో మాట్లాడారు.

ఫ్యాక్టరీ నడిపించేందుకు కృషి చేస్తానని కార్మికులకు మాటిచ్చారు. పట్టణంలోని వివిధ కాలనీల్లో  పర్యటించి అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను వెంటనే తిరిగి నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ శుభాష్ రావుకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాములు, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.