సిద్దిపేటలో గంగాభవానీ ఆలయ వార్షికోత్సవం.. పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్రావు

సిద్దిపేటలో  గంగాభవానీ ఆలయ వార్షికోత్సవం.. పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్రావు

సిద్దిపేట, వెలుగు : పట్టణంలోని కోమటి చెరువు వద్ద గల గంగాభవానీ ఆలయ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి హరీశ్​రావు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేండ్లకోసారి వచ్చే గంగాభవానీ ఆలయ వార్షికోత్సవాన్ని గంగపుత్ర సంఘం నాయకులు ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. 

గంగాభవానీ ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోవడమే కాకుండా ఫంక్షన్ హాల్​ను నిర్మించుకున్నామన్నారు. సిద్దిపేట కోమటి చెరువుతోపాటు అన్ని చెరువులను అభివృద్ది చేసుకున్నామని తెలిపారు. సిద్దిపేట చేపలు కోల్​కతా మార్కెట్ వరకు పంపడమే కాకుండా ఇక్కడ నిర్మించిన ఫిష్ మార్కెట్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు.