హైదరాబాద్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన మంగళవారం (అక్టోబర్ 28) తెల్లవారుజూమున తుది శ్వాస విడిచారు.
కుటుంబ సభ్యులు, బంధువులు, కార్యకర్తల సందర్శనార్థం సత్యనారాయణ రావు పార్థివ దేహాన్ని హైదరాబాద్లోని హరీష్ రావు నివాసం క్రిన్స్ విల్లాస్లో ఉంచనున్నారు. సత్యనారాయణ రావు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
