కాంగ్రెస్లో రాహుల్, రేవంత్.. రెండు నాలుకలు: కేటీఆర్

కాంగ్రెస్లో రాహుల్, రేవంత్.. రెండు నాలుకలు: కేటీఆర్

కాంగ్రెస్ లో రాహుల్, సీఎం రేవంత్ లది రెండు నాలుకల ధోరణని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. లిక్కర్ స్కాంలో  ఇద్దరు తలో మాట మాట్లాడుతున్నారని అన్నారు.  లిక్కర్ స్కాం జరగలేదని రాహుల్ అంటుంటే.. స్కాం జరిగిందని రేవంత్ అంటున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర చేస్తూ మోడీ చౌకీ ధార్ అంటుంటే.. మోదీ తన పెద్దన్న అని రేవంత్ రెడ్డి  అంటున్నారు.  ఫ్రాడ్ హై అని రాహుల్ గాంధీ అంటే...అదానీ హమారా ఫ్రెండ్ అంటున్నారు. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ అంటే...రేవంత్ రెడ్డి  తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తా అంటారు .రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి పిచ్చోన్ని చేస్తున్నారని మండిపడ్డారు.

మల్కాజ్ గిరి పార్లమెంట్ పార్టీ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. రేవంత్ సీఎంగా మాట్లాడే మాటలు మాట్లాడటం లేదన్నారు.  రేవంత్ సర్కార్ ను పడగొట్టాల్సిన ఖర్మ మాకు లేదు..  నల్గొండ, ఖమ్మం మానవ బాంబులు నీ పక్కనే ఉన్నాయి. రేవంత్ ఐదేళ్లపాటు సీఎంగా  ఉండాలి.  రేవంత్ ఫోన్ ట్యాపింగ్ పై పెట్టిన శ్రద్ధ మంచినీళ్లపై పెట్టు. రేవంత్ రెడ్డి కేసుల నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా బీజేపీలో చేరతారని ఆరోపించారు కేటీఆర్.

కొంత మంది నాయకులు వెళ్లినా పార్టీకి నష్టం లేదన్న కేటీఆర్..ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ 420 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఇప్పటికీ అమలు కాలేదన్నారు.