హైదరాబాద్: కమ్మ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ‘సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన అన్నీ కులాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్న మీ నిర్ణయం అభినందనీయం. కమ్మవారు చట్టపరంగా అగ్రవర్ణమే ఐనా… ఆ కులంలో మెజారిటీ ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు.
కమ్మ సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడి.. పూటగడవని వారు ఎందరో ఉన్నారు. పేద కమ్మ వారిని ఆదుకునేందుకు మిగతా కులాల మాదిరిగానే “కమ్మ సంక్షేమ కార్పొరేషన్” ఏర్పాటు చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. కమ్మవారి సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తొలి ముఖ్యమంత్రిగా మీ పేరు ఉండిపోతుంది. ’ అని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు.
