ప్రజలెప్పుడూ మారరు.. నాయకులే మారుతుంటారు

ప్రజలెప్పుడూ మారరు.. నాయకులే మారుతుంటారు

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో కీలక నేత అయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీ మారుతారనే ఊహాగానాలు ఉన్నాయి. ఇటీవల మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, తుమ్మల, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తుమ్మల చేస్తున్న కామెంట్స్ కూడా  టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారాయి.  లేటెస్ట్ గా మరోసారి    ఇవాళ జిల్లాలోని  చింతకాని మండలం నాగులవంచ, పాతర్ల పాడు గ్రామంలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన  తుమ్మల హాట్ కామెంట్స్ చేశారు.  ఓ కార్యకర్తతో మాట్లాడుతూ.. ఆనాడు మీ ఊర్లో  ఒక్క సీసీరోడ్డు కూడా లేదని.. తానే దగ్గరుండి అభివృద్ధి చేసి 33 బ్రిడ్జిలు కట్టించానన్నారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.  ప్రజలను తప్పుపట్టడం లేదని.. నాయకులే కరెక్ట్ గా లేరు.. పార్టీలు మారుతున్నారన్నారు.  అనంతరం ఇదే కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  వచ్చి వెళ్లారు. ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వారు ఇలా వేర్వేరుగా రావడం చర్చనీయాంశంగా మారింది. ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

For More News..

పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్

ప్రపంచ కప్ లో భారత్ ఇకపై ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే!