ప్రపంచ కప్ లో భారత్ ఇకపై ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే!

ప్రపంచ కప్ లో భారత్ ఇకపై ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే!

ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. మిథాలీ సేన నిర్దేశించిన 278 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి  చేధించింది. ఓపెనర్లు రేచెల్ హేయాన్స్ 43 ,అలిస్సా హేలీ 72 మంచి ఓపెనింగ్ అందించారు. వీరికి తోడు కెప్టెన్ మెగ్ లానింగ్ 97 తో చెలరేగారు.  ఎలీస్సా పెర్రీ 28, బెత్ మోనీ 30 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా  ఇంకా మూడు బంతులుండగానే విజయం సాధించింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్లు స్మృతి మంధాన 10,షెఫాలియా వర్మా 12 నిరాశ పరిచారు. యాస్తికా భాటియా 59, కెప్టెన్ మిథాలీ రాజ్ 68 హర్మన్ ప్రీత్ కౌర్ 57 , పూజా వస్త్రాకర్ 34 తో రాణించడంతో 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఈ ఓటమితో భారత్ ఇకపై జరిగే అన్ని మ్యాచ్ లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి వచ్చింది.