హత్యలకు పాల్పడేవారికి పాలించే హక్కు లేదు..జగన్​కు ఓటు వేయొద్దు : సునీత

హత్యలకు పాల్పడేవారికి పాలించే హక్కు లేదు..జగన్​కు ఓటు వేయొద్దు : సునీత

న్యూఢిల్లీ, వెలుగు : తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌కు, ఆయన పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దని ఏపీ ప్రజలను మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా నర్రెడ్డి కోరారు. హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదని విమర్శించారు.  తాను ఎక్కడికి వెళ్లినా వివేకా హత్య కేసు గురించి అడుగుతు న్నారని తెలిపారు. మొదటి నుంచి షర్మిల ఒక్కరే తనకు అండగా నిలిచారని వెల్లడించారు.

అలాగే ఈ కేసుకు సంబంధించిన పోరాటంలో సపోర్టుగా ఉన్న చంద్రబాబు, పవన్‌‌ కల్యాణ్, ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలోని కాన్ట్సిట్యూషన్ క్లబ్‌‌లో సునీతా  మీడియాతో మాట్లాడారు. తండ్రి హత్య కేసు లో తాను చేస్తున్న న్యాయ పోరాటం కొనసాగు తుందన్నారు.

సాధారణంగా హత్య కేసు 4, 5 రోజుల్లో తేలుతుందన్నారు. కానీ వివేకా హత్య కేసు దర్యాప్తు మాత్రం ఏండ్ల తరబడి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందన్నారు. వారిద్దరిని జగన్ రక్షిస్తున్నారని ఆరోపించారు.