ఆపరేషన్ అనంతరం చనిపోయిన బ్రెజిల్ అందగత్తె

ఆపరేషన్ అనంతరం చనిపోయిన బ్రెజిల్ అందగత్తె

బ్రెజిల్ అందగత్తె గ్లేసి కొరియా ఇక లేరు. శస్త్ర చికిత్స అనంతరం ఆమె చనిపోవడంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. కోమాలో ఉన్న ఆమె తిరిగి వస్తుందని అందరూ భావించారు. కానీ.. 27 సంవత్సరాలున్న ఈమె మరణించడంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చింది. కొన్ని నెలల క్రితం టాన్సిల్స్ ఆపరేషన్ చేయించుకుంది. కొద్ది రోజుల తర్వాత.. మెదడులో రక్తస్రావం అవడంతో ఆసుపత్రిలో చేరారు. దాదాపు రెండు నెలల పాటు కోమాలో ఉండిపోయారు.

జూన్ 20వ తేదీన కన్నుమూశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆమె లేని లోటు తీర్చలేమని, అద్భతమైన మహిళగా అభివర్ణించారు కుటుంబసభ్యుడు. అందర్నీ ఎంతో ప్రేమించేదని, చిరునవ్వుతో ఉన్న ఆమె లేకపోవడం జీవించలేమన్నారు. ఆమె చిరునవ్వుతో ఆకాశాన్ని ప్రకాశవంతం చేస్తుందని, తన లక్ష్యాన్ని చేరుకుందన్నారు. 2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ బ్రెజిల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. టైటిల్ గెలిచిన అనంతరం ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ పేజీకి 57 వేల మంది ఫాలోవర్లున్నారు. ఆమెకు సోషల్ మీడియాలో అభిమానులు నివాళులర్పిస్తున్నారు.