పెండింగ్ వేతనాలు, పీఎఫ్ చెల్లించాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

పెండింగ్ వేతనాలు, పీఎఫ్ చెల్లించాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి శానిటేషన్ కార్మికులు, పేషెంట్ కేర్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డుల పెండింగ్​వేతనాలు, పీఎఫ్​చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.భూపాల్ డిమాండ్ చేశారు. 

దవాఖానలో మూడు రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న కార్మికులకు ఆదివారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్తగా విధుల్లోకి తీసుకున్న 70 మందికి నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం, పాత వారికి పీఎఫ్ ను వారి ఖాతాల్లో జమ చేయకుండా టెక్నికల్ సమస్య పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఎ–వన్ ఏజెన్సీ వచ్చినప్పటి నుంచి కార్మికుల సమస్యలు పెరిగాయని ఆరోపించారు. 

కాంట్రాక్టర్  కాలపరిమితి ముగిసిందని పీఎఫ్ కట్టకుండా పోతే అధికారులే బాధ్యత వహించాలన్నారు. సీఐటీయూ నాయకులు చిన్నపాక లక్ష్మీనారాయణ, ఎండీ.సలీం, డి.సత్తయ్య, హాస్పిటల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు యాదగిరి, వెంకన్న, సైదులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.