ఎమ్మెల్యే రోహిత్పై కేసు నమోదు చేయాలి : పద్మా దేవేందర్రెడ్డి

ఎమ్మెల్యే రోహిత్పై కేసు నమోదు చేయాలి : పద్మా దేవేందర్రెడ్డి
  • ఎస్పీకి  ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి

మెదక్​టౌన్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్​రావు, కేటీఆర్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రోహిత్​రావుపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్​మెదక్​జిల్లా ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి, బీఆర్ఎస్​ నాయకులు బుధవారం ఎస్పీ శ్రీనివాస్​రావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం పద్మా దేవేందర్​రెడ్డి మాట్లాడుతూ..ఎమ్మెల్యే రోహిత్ రావు బీఆర్ఎస్​నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా కేసీఆర్​పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే అప్పటి ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. 

రోహిత్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడని ఇది సరికాదన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్​నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినా అందుకు పూర్తి బాధ్యత ఎమ్మెల్యే రోహిత్​రావుదేనని పేర్కొన్నారు. ఆమె వెంట జితేందర్​గౌడ్​, చంద్రం, నరేందర్, జీవన్​రావు, విశ్వం, కిషోర్, శ్రీనివాస్, జయరాజ్, మల్లేశం, అంజా గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, లింగా రెడ్డి, కృష్ణ గౌడ్, ఉదయ్, సాయ గౌడ్, అహ్మద్, నారాయణ,ఉమా మహేశ్వర్, సాయిలు, శ్రీను నాయక్, స్వామి నాయక్, రంజిత్, లక్ష్మణ్, కిరణ్, రంజిత్ ఉన్నారు.