సీఎం హాస్పిటల్‍ ఓపెనింగ్‍ కోసమే వచ్చిండు : వినయ్‍ భాస్కర్‍, ధర్మారెడ్డి

సీఎం హాస్పిటల్‍ ఓపెనింగ్‍ కోసమే వచ్చిండు : వినయ్‍ భాస్కర్‍, ధర్మారెడ్డి
  • మాజీ ఎమ్మెల్యేలు వినయ్‍ భాస్కర్‍, ధర్మారెడ్డి, సుదర్శన్‍రెడ్డి 

వరంగల్‍, వెలుగు : ప్రైవేట్‍ హాస్పిటల్‍ ఓపెనింగ్‍ కోసం సీఎం రేవంత్‍రెడ్డి వరంగల్‍ పర్యటన వచ్చాడు తప్పితే గ్రేటర్‍ సిటీ, ఉమ్మడి వరంగల్‍ జిల్లా అభివృద్ధికి ఒక్క రూపాయి ఫండ్‍ ఇయ్యలేదని మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‍ భాస్కర్‍, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‍రెడ్డి విమర్శించారు. శనివారం గ్రేటర్‍ వరంగల్​లో సీఎం కేసీఆర్‍ పర్యటన నేపథ్యంలో ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‍ఎస్‍ ఆఫీస్‍లో వారు ప్రెస్‍మీట్‍ నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్‍భాస్కర్‍ మాట్లాడుతూ జిల్లాలోని 24 అంతస్తుల సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ పనుల కోసం కేసీఆర్‍ రూ.1,600 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.

రేవంత్‍రెడ్డి మాత్రం కనీసం ఎంజీఎం హాస్పిటల్‍ సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ కాకతీయ మెగా టెక్స్​టైల్​ పార్కులో వానలు, వరదల కారణంగా కైటెక్స్​కంపెనీ మిషన్లు పాడయ్యాయని, అందువల్లే ఓపెనింగ్‍ ఆరు నెలలు ఆలస్యమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్రలో భాగంగా బ్రౌన్‍ఫీల్డ్‍లో రూ.500 కోట్లు ఇస్తామని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‍రెడ్డి కొత్త ప్రాజెక్టులు తేకున్నా పర్లేదు తప్పితే ఇప్పటికే మంజూరైన పనులు, ప్రాజెక్టులను త్వరగా వచ్చేలా చూసుకోవాలని హితవు పలికారు.

సీఎం రేవంత్‍రెడ్డి పార్క్​ భూబాధితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పడాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ రేవంత్‍రెడ్డిని కాంగ్రెస్‍ లో కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే నమ్ముతున్నారని, మిగతావారంతా ఆయనపై విశ్వాసంతో లేరన్నారు. సీఎం వరంగల్‍ పర్యటనవల్ల రూ.3 కోట్లు వృథా ఖర్చు అవడం తప్పించి, జిల్లాకు ఒరిగింది శూన్యమన్నారు. ప్రెస్​మీట్​లో నేతలు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.