
నిజామాబాద్‌రూరల్, వెలుగు: ప్రజల ఆశీస్సులతో నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గంలోని మోపాల్, డిచ్పల్లి, నిజామాబాద్ మండలాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్లీడర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలివిడిగా దోపిడీ లకు పాల్పడుతున్నారన్నారు. బీఆర్ఎస్వైఫల్యాలను గుర్తించిన ప్రజలు, ఈ ఎన్నికల్లో వారిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో లీడర్లు ముప్ప గంగారెడ్డి, శేఖర్‌గౌడ్, కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.