
హైదరాబాద్ : తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు.. మాజీ MP, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి. తన క్రెడిబిలిటీని దెబ్బతీసేందుకు సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు వివేక్. వివిద న్యూస్ చానల్స్ పేరుతో ఫేక్ ఫొటోలు తయారుచేసి.. పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై.. చర్యలు తీసుకోవాలంటూ.. ఫిర్యాదు చేశారు. రాజకీయoగా ఎదుర్కోలేకనే ప్రత్యర్ధులు ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలు, ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నవారితో పాటు.. వాటిని సెర్క్యులేట్ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు వివేక్ వెంకటస్వామి.