జగన్‌కు ఉన్నది కేసీఆర్‌కు లేనిది.. అవగాహనే

జగన్‌కు ఉన్నది కేసీఆర్‌కు లేనిది.. అవగాహనే

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీకి సీఎం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరే కారణమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ బాధ్యత లేని చర్యల వల్లే ఈ పంచాయతీ వచ్చిందని ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్లే కేంద్రం ముందుకొచ్చిందన్నారు. పెద్ద ప్రాజెక్టుల పేరుతో చిన్న వాటిని పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్, టీడీపీలు తప్ప టీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. 

‘నీళ్ల పంచాయతీ వల్ల జరుగుతున్న నష్టం పై ఆర్టీఐ పెట్టినం. ఇద్దరు సీఎంలు కలసి శ్రీశైలం ఖాళీ చేసిన్రు.  కేంద్రం హిస్టారికల్ నిర్ణయం తీసుకుంది. ఆయన గోదావరి అమ్ముకున్నారు. ఈయన కృష్ణ అమ్ముకున్నడని అర్థమైంది. 4  లక్షల కోట్లు అప్పు చేసిన్రు. అక్టోబర్ 14 తర్వాత గెజిట్ అమలవుతుంది.  ఇన్నాళ్లూ ఫామ్ హౌస్‌లో పడుకున్న కేసీఆర్ ఇప్పుడు మేల్కొని హడావుడి చేస్తున్నడు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. నాడు మృగశిర వరకు రంగారెడ్డికి నీళ్లు తెస్తా అన్నాడు. ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ తెచ్చింది. కొన్ని టీడీపీ చేసింది. కానీ వీళ్లు ఏమీ చేయలేదు. ఇంత అన్యాయం జరుగుతుందనుకోలేదు. నర్సులకు ఉద్యోగాలు లేవు. వారి సేవలు వినియోగించుకొని వదిలేశారు. పెద్ద ప్రాజెక్ట్స్ అని చిన్నవాటిని మర్చిపోయారు. ఆంధ్ర సీఎంకు అవగాహన ఉంది కానీ కేసీఆర్‌కు లేదు. మన ముఖ్యమంత్రి మనకు నష్టం చేస్తున్నడు’ అని విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు.