చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలి : పొన్నం ప్రభాకర్

చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలి : పొన్నం ప్రభాకర్
  •     మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

రాజన్న సిరిసిల్ల, వెలుగు : చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  సోమవారం జాతీయ  చేనేత దినోత్సవం సందర్భంగా  సిరిసిల్ల పట్టణంలోని పాత బసాండ్‌‌లో ఉన్న చేనేత విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.  కేంద్రం ప్రకటించిన మెగా టెక్స్ టైల్ పార్క్ సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని డిమాండ్​చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, సంగీతం శ్రీనివాస్ పాల్గోన్నారు.

చొప్పదండి/రామడుగు, సుల్తానాబాద్‌‌ : చేనేత దినోత్సవం సందర్భంగా చొప్పదండి, రామడుగు, సుల్తానాబాద్​మండలాల్లో పద్మశాలీ యువజన, కుల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నేతన్న విగ్రహాలకు పూలమాలలు వేశారు. చొప్పదండి, రామడుగు మండలం వెంకట్రావుపల్లిల్లో చేనేత  కార్మికులను సన్మానించారు. అర్హులైన చేనేత కుటుంబాలకు చేనేత బంధు, బీసీ కార్పోరేషన్​ కింద రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో లీడర్లు విజయలక్ష్మి, రాజయ్య, సాంబయ్య,  కృష్ణహరి, మహేందర్, నీలయ్య, మురళి, రాజేంద్రప్రసాద్, చందు, రాములు, అలువాల విష్ణు, కార్తీక్, నర్సయ్య, శంకరయ్య పాల్గొన్నారు.