టీఆర్ఎస్, బీజేపీలది ఒకటే సిద్ధాంతం

టీఆర్ఎస్, బీజేపీలది ఒకటే సిద్ధాంతం

రాజన్న సిరిసిల్ల జిల్లా :  టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే సిద్ధాంతంతో పని చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్  అన్నారు.  రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, టీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ సిరిసిల్లపై వివక్ష చూపుతున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ కు మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుకున్నది వినోద్ కుమారేనని ఆరోపించారు. మెడికల్, టెక్స్ టైల్ క్లస్టర్లు సిరిసిల్ల కు రాకుండా వినోద్ కుమార్ చేశారన్నారు. వినోద్ కుమార్ సిరిసిల్ల కు ఏం చేశారనే దానిపై ప్రెస్ క్లబ్ వేదికగా బహిరంగ చర్చకు సిద్దమని చెప్పారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పొన్నం మాట్లాడారు.

‘‘నేను ఎంపీగా ఉన్న సమయంలో మంజూరు చేసిన జాతీయ రహదారిని స్వార్థ ప్రయోజనాల కోసం ప్రతిమ కాలేజీ నుంచి మలుపులు తిప్పుతున్నరు. పచ్చని పొలాలు జాతీయ రహదారిలో పోతున్నయి. రైతులకు మద్దతుగా నిలవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎంపీ బండి సంజయ్ కు వినతి పత్రం సమర్పించారు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానిక నాయకులు లేరా  ? వేములవాడ, సిరిసిల్ల ఎమ్మెల్యేలు స్థానికేతరులు, ఎంపీ వినోద్ స్థానికేతర నాయకుడు’’ అని వ్యాఖ్యానించారు. నేతన్నలకు నేత బంధు ఇవ్వాలి.. బీమా కాదు అని చెప్పారు.