కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు

మంచిర్యాల జిల్లా: వ‌ర్షాల కార‌ణంగా న‌ష్టపోయిన రైతుల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే ఆదుకోవాల‌న్నారు బీజేపీ నాయకులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. వారి ఖాతాల‌లో ఎక‌రానికి రూ.30 వేల చొప్పున న‌ష్ట‌ప‌రిహారాన్ని జ‌మ చేయాలని డిమాండ్ చేశారు. శ‌నివారం జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గం కొటపల్లి మండలం అన్నారం గ్రామంలో ఇటీవలి ప్రాణహిత వరద వల్ల ముంపునకు గురైన పంటలను వివేక్ పరిశీలించారు. నష్ట పోయిన రైతులను పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. కాళెశ్వరం ప్రాజెక్టు డిజైన్ లో లోపం వల్లే రైతులు నష్టపొవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. 35 వేల కోట్ల రుపాయల ప్రాజెక్ట్ ను సీఎం కమీషన్ల కోసం లక్ష కోట్లకు పెంచాడ‌ని.. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడ‌న్నారు.

నష్ట పోయిన రైతులను ప్రభుత్వం అన్నీ విధాలుగా ఆదుకోవాల‌ని, కౌలు రైతులకు నష్ట పరిహారం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వివేక్ అన్నారు.