మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా

మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది. ఆయన ఈ రోజు నార్మల్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడ వైద్యులు కరోనా టెస్ట్ చేయగా.. ఆయన పాజిటివ్ వచ్చింది. దాంతో గత వారం రోజుల నుంచి తనతో కాంటాక్ట్ లో ఉన్న వాళ్లందరూ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లాలని ఆయన సూచించారు. అంతేకాకుండా వారందరూ.. కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని కోరారు.

ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు దేశానికి 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన భారత ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలలో పనిచేశారు.

For More News..

హత్య కేసు నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసిన సిటీ పోలీసులు

ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలి

సముద్రగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును ప్రారంభించిన మోడీ