V6 News

కాంగ్రెస్ కు పంజాబ్ మాజీ సీఎం రాజీనామా

కాంగ్రెస్ కు పంజాబ్ మాజీ సీఎం  రాజీనామా

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ (79) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వైఖరితో తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్టు అమరీందర్ సింగ్ తెలిపారు.దీనికి సంబంధించి  సోనియాకు 7 పేజీల లేఖ రాశారు.

సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రవర్తన తను తీవ్రంగా బాధించిందన్నారు అమరీందర్ సింగ్. రాహుల్, ప్రియాంకలను తాను సొంతబిడ్డల్లా భావించానని, కానీ వారు తన పట్ల చూపిన వ్యతిరేకతను భరించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. వారి తండ్రి రాజీవ్ గాంధీ, తాను 1954 నుంచి కలిసి చదువుకున్నామని, వారి కుటుంబంతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని తెలిపారు.

పంజాబ్ కాంగ్రెస్ లో ఇటీవల కాలంలో నెలకొన్న పరిణామాలతో అమరీందర్ సింగ్ సీఎం పదవికి సెప్టెంబరు 18న రాజీనామా చేశారు. పీసీసీ చీఫ్ గా ఉన్న నవజ్యోత్ సిద్ధూతో విభేదాలు తీవ్రరూపు దాల్చడంతో తనకు పార్టీ హైకమాండ్ నుంచి మద్దతు లేదని భావించిన అమరీందర్ సింగ్ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత సొంత పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అనుకున్నట్లుగానే  దీనికి సంబంధించి .. పార్టీనీ త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అమరీందర్ సింగ్. ఎన్నికల సంఘం పేరు, గుర్తును క్లియర్ చేసిన వెంటనే తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని సింగ్ ప్రకటించారు. పంజాబ్‌లోని మొత్తం 117 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కూడా ఆయన చెప్పారు.