తాగేందుకు రూ.100 అడిగితే ఇవ్వలేదని చంపేశాడు

తాగేందుకు రూ.100 అడిగితే ఇవ్వలేదని చంపేశాడు
  • మృతుడు మాజీ వైస్ ఛాన్స్ లర్ ధృవరాజ్ నాయక్

భుబనేశ్వర్: తాగేందుకు రూ.100 అడిగితే ఇవ్వలేదని కోపం పట్టలేక దొరికిన వస్తువుతో దాడి చేసి దారుణంగా చంపేశాడు. ఒడిశాలోని జార్సుగూడ జిల్లా కౌరాముల్ గ్రామంలో ఆదివారం జరిగిదీ దారుణ ఘటన. చనిపోయిన వ్యక్తి సంబల్ పూర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్ లర్ ధృవరాజ్ నాయక్  కావడంతో దారుణ ఘటన మొత్తం ఒడిశా రాష్ట్రాన్నే కుదిపేసింది. వివరాలిలా ఉన్నాయి. 
సంబల్ పూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా పనిచేసిన ధృవరాజ్ నాయక్ పదవీవిరమణ తర్వాత తన స్వగ్రామం అయిన జార్సుగూడ జిల్లాలోని లైకెరా పోలీసు స్టేషన్ పరిధిలో గల కౌరాముల్ గ్రామంలో నివసిస్తున్నాడు. అదే గ్రామంలో ఈయన గారి ఇంటికి ఎదురుంటికి చెందిన ప్రవీణ్ ధారువా (20) అనే యువకుడు జులాయిగా తిరిగి మద్యానికి బానిసగా మారాడు. ఆదివారం రోజున మద్యం తాగేందుకు ఇంటి నుంచి బయటకొచ్చిన ప్రవీణ్ ధృవరాజు నాయక్ ఇంటికొచ్చాడు. నాయక్ గారిని పిలిచి కొంత డబ్బు ఇవ్వమని అడిగాడు. అతని వ్యసనాల గురించి తెలిసిన ఆయన ఇచ్చేందుకు నిరాకరించాడు.

కనీసం వంద రూపాయలైనా ఇవ్వమని ప్రవీణ్ ప్రాధేయపడ్డాడు. ఇంటెదురుగా ఉండే వారికి వంద రూపాయలివ్వలేకపోతే ఏం బతుకు నీదంటూ బూతులు తిట్టుకుంటూ వెళ్లిపోయాడు. తన ఇంటి ముందు నిలబడి ఈయన ఇంట్లో వీధిలో అందరికీ వినపడేటట్లు తిట్లు లంకించుకున్నాడు. తని తిట్లు వినలేక శాంతింప చేసేందుకు ఆయన ఇంటి బయటకు రాగా..  ధృవరాజు నాయక్ఆ బయటకు రావడం చూసి ఆగ్రహానికి గురైన ప్రవీణ్ తన ఇంట్లోని గొడ్డలిని తీసుకొచ్చి నాయక్ పై దాడి చేశాడు. 

దీంతో ఆయన భయంతో ఆర్తనాదాలు చేయగా... ఈయన కేకలు విని ఇంట్లో ఉంటున్న ఆయన భార్య, కూతురు, అల్లుడు పరిగెత్తుకుంటూ  వచ్చారు. వీరి రాకను చూసి అప్పటికే గొడ్డలితో దాడి చేసిన ప్రవీణ్ పారిపోయాడు. దీంతో గాయపడిన ధృవరాజ్ నాయక్ ను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకురాగా తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన తుదిశ్వాస విడిచాడు. కేవలం వంద రూపాయలు ఇవ్వనందుకు కోపం పట్టలేక పట్టుమని 20 ఏళ్లు కూడా లేని ప్రవీణ్ తాగుడుకు బానిసై దాడి చేసి చంపిన ఘటన కలకలం రేపింది.