బీజాపూర్‌‌ జిల్లాలో ఇన్‌‌ఫార్మర్‌‌ నెపంతో మాజీ సర్పంచ్‌‌ హత్య

 బీజాపూర్‌‌ జిల్లాలో ఇన్‌‌ఫార్మర్‌‌ నెపంతో మాజీ సర్పంచ్‌‌ హత్య
  • చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌ జిల్లాలో ఘటన

భద్రాచలం, వెలుగు : ఇన్‌‌ఫార్మర్‌‌ పేరుతో చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌ జిల్లాకు చెందిన ఓ మాజీ సర్పంచ్‌‌ను మావోయిస్టులు చంపేశారు. వివరాల్లోకి వెళ్తే... మోదక్‌‌పాల్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధిలోని చిన్న కోడెపాల్‌‌ గ్రామానికి చెందిన జువ్వా విజయ్‌‌ ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. మావోయిస్టులు వచ్చి అతడిని బయటకు తీసుకెళ్లారు. దళాల సమాచారం పోలీసులకు అందిస్తున్నావంటూ తీవ్రంగా కొట్టారు. తర్వాత కత్తితో గొంతు కోసి, డెడ్‌‌బాడీని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. గ్రామస్తుల సమాచారం పోలీసులు సోమవారం ఉదయం మోదక్‌‌పాల్‌‌ గ్రామానికి చేరుకొని, విజయ్‌‌ డెడ్‌‌బాడీని పోస్ట్‌‌మార్టం కోసం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఎన్‌‌కౌంటర్‌‌ మృతుడు గుర్తింపు

చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌ జిల్లా ఇంద్రావతి నేషనల్‌‌ పార్క్‌‌ ఏరియాలో ఈ నెల 5న జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌లో చనిపోయిన మావోయిస్ట్‌‌ను పీఎల్‌‌జీఏ బెటాలియన్‌‌ 1 డిప్యూటీ కమాండర్‌‌ సోడె కన్నారావుగా గుర్తించినట్లు ఎస్పీ జితేంద్రకుమార్‌‌ ప్రకటించారు. ఇతడిపై రూ.8 లక్షల రివార్డు ఉందన్నారు. ఎన్‌‌కౌంటర్‌‌ జరిగిన ప్రదేశం నుంచి 303 రైఫిల్‌‌తో పాటు ఇతర పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.