
వనపర్తి: మొసలిని తాళ్లతో కట్టేసిన ఘటన కొత్తకోట మండలం బూత్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలం దగ్గరికి వెళ్లిన రైతుకు ఊహించని సంఘటన ఎదురైంది. పొలంలో పనుల్లో ఉండగా ఓ మొసలి రైతు కంట పడింది. వెంటనే కొంతమంది రైతుల సాయంతో ఆ మొసలిని పట్టుకొని తాళ్లతో బంధించి కట్టి పడేశారు.