Annapoorani Movie: నయనతార సినిమాపై కేసు నమోదు..ఎందుకంటే?

Annapoorani Movie: నయనతార సినిమాపై కేసు నమోదు..ఎందుకంటే?

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanathara) లేటెస్ట్ ఫిల్మ్ అన్నపూరణి (Annapoorani). రీసెంట్గా థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీపై ముంబైలో కేసు నమోదైంది. 

ఈ సినిమాలో పలు సన్నివేశాలు శ్రీరాముడిని కించపరిచేలా ఉన్నాయంటూ మాజీ శివసేన నేత రమేశ్ సోలంకి(Ramesh Solanki) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా..లవ్ జిహాద్ను ప్రోత్సహించేలా సీన్స్ ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ  మేరకు ఫిర్యాదు చేసిన విషయాన్ని తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 

అన్నపూరణి సినిమాను నిర్మించిన నిర్మాతలతో పాటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్, దర్శకుడు నీలేష్ కృష్ణ, హీరోయిన్ నయనతార,జై ఇలా పలువురి మేకర్స్ పై తగిన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. అంతేకాకుండా..వీరందరిపై త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని.. స్ట్రీమింగ్ ఆపేయాలని మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అభ్యర్థించారు.

అయితే ఇప్పటివరకు ఈ ఫిర్యాదుపై అన్నపూరణి మేకర్స్ నుంచి ఎవరు స్పందించలేదు. కాగా..ఈ చిత్రం డిసెంబర్ 1, 2023న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.