సింగిల్ విండో మాజీ చైర్మన్ మృతి

సింగిల్ విండో మాజీ చైర్మన్ మృతి
  • పాడె మోసిన ఎమ్మెల్యే

బజార్ హత్నూర్, వెలుగు: బజార్ హత్నూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత చట్ల గజ్జయ్య (55) కొంత కాలంగా అనారోగ్యం బాధపడుతూ ఆదివారం మృతిచెందారు. ఆయన గతంలో సింగిల్ విండో చైర్మన్ గానూ పనిచేశారు. గజ్జయ్య మృతి వార్త తెలుసుకున్న ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అక్కడికి చేరుకొని, ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు.

 అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అందరితో కలివిడిగా ఉండే నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన అంత్యక్రియల్లో అనిల్ జాదవ్ పాల్గొని పాడె మోశారు. మాజీ జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య, బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.