కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూత

 కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూత

కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, సీనియర్‌ న్యాయవాది శాంతి భూషణ్‌ (97) కన్నుమూశారు. ఢిల్లీలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. శాంతి భూషణ్ 1977-79 నుంచి వరకు మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. 1980లో ప్రఖ్యాత ఎన్జీవో  సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ సంస్థను స్థాపించారు. ఇది స్థాపించినప్పటి నుంచి అనేక ముఖ్యమైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది. శాంతి భూషణ్ 2009లో దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 1974లో ఇందిరాగాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని సవాల్‌ చేసిన రాజ్‌ నారాయణ తరఫున శాంతి భూషణ్‌ అలహాబాద్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పును వెలువరించింది.

ఉత్తర్ప్రదేశ్లోని బిజ్నోర్ లో 1925 నంబర్ 11న జన్మించిన శాంతి భూషణ్..సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. 14 జూలై 1977 నుంచి 2 ఏప్రిల్‌ 1980 వరకు రాజ్యసభ సభ్యుడిగా శాంతి భూషణ్  పని చేశారు. ఇందిరాగాంధీతో విభేదాలు ఏర్పడి చీలిపోయిన కాంగ్రెస్ (ఓ) పార్టీలో సేవలందించారు. ఆ తర్వాత జనతా పార్టీలో.. 1980లో బీజేపీలో చేరారు. 1986లో ఎన్నికల పిటిషన్‌పై బీజేపీ ఆయన సలహాలను అంగీకరించకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు.  2012లో  ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటులో శాంతి భూషణ్ కీలకంగా వ్యవహరించారు.