దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌‌

దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా  వ్యాక్సిన్‌‌

కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి 

బాలాసోర్: దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌‌ను ఉచితంగా అందిస్తామని కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి చెప్పారు. ఒక్క బిహార్‌‌లోనే గాక దేశం మొత్తం ఫ్రీ వ్యాక్సిన్‌‌ను అందివ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతాప్ సారంగి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్ చేయడానికి ఒక్కొక్కరి కోసం కేంద్రం రూ.500 ఖర్చు చేస్తుందని వెల్లడించారు.

దేశంలోని ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారని చెప్పారు. ప్రజలకు వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తారా లేదా అని ఒడిషా ఫుడ్ సప్లయ్స్ అండ్ కన్జూమర్ వెల్ఫేర్ మినిస్టర్ ఆర్.పి.స్వెయిన్ కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, సారంగిలను వివరణ కోరారు. ఒడిశాలో వ్యాక్సిన్‌‌పై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ పొందే అవకాశం ఎందుకు లేదో చెప్పాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సారంగి పైవిధంగా స్పందించారు. దేశ ప్రజలందరికీ ఫ్రీగా కరోనా టీకా అందిస్తామని వివరించారు.