
బీఆర్ఎస్ నేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫోన్ చేశారు. కేసీఆర్ ఆరోగ్యంపై చర్చించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అఖిలేష్ యాదవ్ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు కాలుకు తీవ్ర గాయం కావడంతో హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో ఎడమ కాలి తుంటి శస్త్రచికిత్స జరిగింది.శస్త్ర చికిత్స అనంతరం ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ప్రస్తుతం కేసీఆర్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారని, ఆపరేషన్ తర్వాత నడవడానికి ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ చెప్పారు. ఆయన కోలుకోవడానికి వాకర్ తో వైద్యులు సాయం చేస్తున్నారు.
మరోవైపు నటుడు ప్రకాశ్ రాజ్ కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. కేసీఆర్ మై రాక్ స్టార్ అని పేర్కొన్నారు నటుడు ప్రకాష్ రాజ్.
శస్త్రచికిత్స అనంతరం మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు.