అణ్వాయుధాల ప్రయోగం జరగవచ్చు: ట్రంప్

అణ్వాయుధాల ప్రయోగం జరగవచ్చు: ట్రంప్

రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలి

న్యూయార్క్: రష్యా, ఉక్రెయిన్​లు వెంటనే యుద్ధానికి ముగింపు పలకాలని, శాంతియుత వాతావరణానికి కృషి చేయాలని అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఇరు దేశాల పరిస్థితులను చూస్తుంటే  అణ్వాయుధాలు ప్రయోగించే చాన్స్ ఉందన్నారు. నెవడాలో నిర్వహించిన ‘సేవ్ అమెరికా’ ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి అజ్ఞానుల వద్ద క్లూ లేదన్నారు. ‘‘ఉక్రెయిన్​లో శాంతియుత వాతావరణం నెలకొనడానికి చర్చలు జరిగేలా మనమంతా డిమాండ్ చేయాలె. లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి యుద్ధమే వస్తే, భూమిపై ఏమీ మిగలదు” అని ట్రంప్ అన్నారు.