ప్రధాని ఒక్కరే నీతిమంతుడైతే సరిపోదు

ప్రధాని ఒక్కరే నీతిమంతుడైతే సరిపోదు

హైదరాబాద్: ప్రధాని ఒక్కరే నీతిమంతుడైతే సరిపోదని, కింది స్థాయి నాయకులు కూడా అలానే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... రాజకీయాల్లో విలువలు పాటించాలని సూచించారు.  ఓ పార్టీలో గెలిచిన నాయకుడు మరో పార్టీలో  చేరడం సమంజసం కాదన్నారు. ఒకవేళ అలా చేయాలనుకుంటే తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలన్నారు.

ప్రతిపక్షం, అధికార పక్షం కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సఖ్యతతో పని చేయాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఐదేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలు అంతకు ముందే వస్తున్నాయన్న వెంకయ్య నాయుడు... కచ్చితంగా ఐదేళ్లకోసారి మాత్రమే ఎన్నికలు జరగాలన్నారు.