బ్యాంక్ అధికారులు తెలుగులో మాట్లాడాలి : వెంకయ్య

బ్యాంక్ అధికారులు తెలుగులో మాట్లాడాలి : వెంకయ్య
  • మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య

జూబ్లీహిల్స్, వెలుగు: బ్యాంకుల్లో వినియోగదారులతో తెలుగులో మాట్లాడితే వారికి విశ్వాసం పెరుగుతుందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ హె చ్ డీ ఎఫ్ సీ భవనంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించగా ఆయన గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బ్యాంకులు ఆర్థిక లావాదేవీలే కాకుండా దేశ ప్రగతికి సహకరించాలన్నారు. మహిళలు, యువతకు రుణాలు ఇచ్చి వ్యాపారంలో ప్రోత్సాహించాలని కోరారు. 

బ్యాంకులకు వచ్చే వారితో తెలుగులో మాట్లాడాలని, తెలుగు భాష తల్లిలాంటిది చెప్పారు. కార్యక్రమంలో ఆర్​బీఐ రీజినల్ డైరెక్టర్ తెలంగాణ చిన్మయి కుమార్, స్టేట్ హెడ్ ఆపరేషన్ హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ మధు గుప్తా పాల్గొన్నారు.