మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యకు వివేక్ వెంకటస్వామి సన్మానం

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యకు వివేక్ వెంకటస్వామి సన్మానం

హైదరాబాద్: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఘనంగా సన్మానించారు. నార్సింగిలోని హోమ్ కన్వెన్షన్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వెంకయ్య నాయుడితో కలిసి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ...  ఉప రాష్ట్రపతి కంటే ప్రజా జీవితంలోనే ఎక్కువ సంతృప్తి దక్కిందన్నారు.  

రాజ్యాంగ పదవుల్లో లిమిటేషన్స్ ఉంటాయని... కానీ ప్రజా జీవితంలో అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతానన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాననీ... ఇప్పుడు రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ లక్ష్మణతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.