త్యాగాల తెలంగాణను.. తాగుబోతుల అడ్డాగా మార్చిండు

త్యాగాల తెలంగాణను.. తాగుబోతుల అడ్డాగా మార్చిండు

సికింద్రాబాద్​, వెలుగు: త్యాగాల తెలంగాణను సీఎం కేసీఆర్​ తాగుబోతుల అడ్డాగా మార్చిండని వైఎస్​ఆర్​టీపీ మాజీ నాయకురాలు ఇందిరా శోభన్ ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో బెల్టు షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా శనివారం మద్యం నియంత్రణ, బెల్ట్ షాపులను రద్దు చేయాలని సికింద్రాబాద్​ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహం వద్ద ఆమె మౌనదీక్ష చేపట్టారు. సీఎంకు జ్ఞానాన్ని ప్రసాదించాలంటూ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ   రాష్ర్టంలో మద్యం  తాగుడు అధికం కావడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతుండగా,  బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని  ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని నడపడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు.