- కేటీఆర్ సహా ఐదుగురు నిందితుల కోర్టు హాజరు తప్పనిసరి
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ శుక్రవారం నుంచి ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రారంభం కానుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, యూకేకు చెందిన ఎఫ్‌ఈఓ ప్రతినిధి అల్‌బర్టో లొంగోలకు కోర్టు గత మే 14న సమన్లు జారీ చేసింది.
జూలై 31న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. ట్రయల్‌లో తొలి విచారణ కావడంతో నిందితులంతా వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంది. గతంలో ఈ కేసులో ఎవరూ అరెస్టు కాకపోవడంతో కోర్టులో వ్యక్తిగత పూచీకత్తు, పర్సనల్ బాండ్ సమర్పించే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
