
హైదరాబాద్ లో ఈ నెల 10, 11న ఫార్ములా ఈ – రేస్ జరుగనుంది. ఈ రేస్ కు HMDA అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీసులు ఇవాళ్టి నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పబ్లిక్ ను అలర్ట్ చెయ్యకుండా.. ఇలా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 10,11 న జరగనున్న రేస్ కు ఇప్పుడు నుండి ట్రాఫిక్ ఆంక్షల విధించడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల చర్యలతో లక్డీకాపూల్, ఖైరతాబాద్, ఐ మాక్స్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది.
ఈ రేస్ కోసం నెక్లెస్ రోడ్డులో 2.7 కి.మీ మేర ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు తల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ గార్డెన్‌లోకి వెళ్లే విధంగా ట్రాక్‌ను రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ గార్డెన్‌లో నుంచి వెనక వైపు ఉన్న మింట్ కాంపౌండ్ మర్రి చెట్టు, ఐమాక్స్ థియేటర్, ఇందిరాగాంధీ విగ్రహం మీదుగా మొత్తం 17 మలుపులు వచ్చేలా ఈ ట్రాక్ వెళ్తుంది.