మనీ మేనేజ్​మెంట్​పై అవగాహన 

మనీ మేనేజ్​మెంట్​పై అవగాహన 

హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన ఫార్చ్యూన్ అకాడమీ  మనీ మేనేజ్‌‌మెంట్​పై  మూడు రోజులపాటు మీటింగ్​ నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ఈ నెల 5–7 తేదీల్లో గోవాలోని పార్క్ రెజిన్‌‌లో జరుగుతుంది. డబ్బును మరింత సమర్థంగా వాడటం, పొదుపు చేయడానికి సంబంధించిన పద్ధతులు నేర్పిస్తారు. డబ్బు ఆదాకు పాటించాల్సిన ఆక్వా సిలికా ఒడిస్సీ, టెర్రా ట్రాన్స్​ఫర్మేషన్, ఈథర్ యాక్సెషన్  ఫీనిక్స్ ఇగ్నిషన్ వంటి వాటిపై అవగాహన కలిగిస్తారు. 'మనీ బ్రేక్‌‌త్రూ స్పెషలిస్ట్', డెంటిస్ట్​ మణి పవిత్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.  కొన్ని పద్ధతులను పాటించడం వల్ల తన ఆదాయం మూడు రెట్లు పెరిగిందని చెప్పారు. డబ్బు సంపాదన కోసం రోజువారీగా పాటించాల్సిన జాగ్రత్తలపై ఈ కార్యక్రమంలో అవగాహన కలిగిస్తామని అన్నారు.