ఢిల్లీ పోలీసుల తీరు పై ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడీ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఢిల్లీ పోలీసుల తీరు పై ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడీ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     జంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజాప్రతినిధుల నిరసనను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్న ఫోరం
  •     రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీ, ఇతర ఎంపీలపై తప్పుడు కేసులు పెట్టడం సరికాదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా ఈనెల 7న జంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద నిరసన తెలిపిన ప్రజాప్రతినిధులపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని ఫోరం ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెమోక్రసీ (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడీ) ఖండించింది. ప్రజాప్రతినిధులకే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. గురువారం ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడీ కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె. రామచంద్రమూర్తి, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి. సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రొఫెసర్లు జి. హరగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శాంతా సిన్హా, రమా మెల్కోటే, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎం. కోదండరామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డి. నరసింహారెడ్డి, సామాజిక ఆలోచకులు డా. గోపాల్ రెడ్డి గాదే,  హైకోర్టు సీనియర్ న్యాయవాది జి. జ్యోతి కిరణ్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిందన్నారు. జంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వందలాది మంది పోలీసులు చుట్టుముట్టి నిరసనకు అవకాశం ఇవ్వలేదని, మరోచోట నిరసన చేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నేతలు కోరినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులను బలప్రయోగంతో అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామికమన్నారు. లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీతో పాటు ఇతర ఎంపీలు పోలీసులపై దాడి చేశారంటూ ఢిల్లీ పోలీసులు ఆరోపణలు చేసి ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నమోదు చేయడం పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని తగ్గించేలా ఉందన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు పోలీసులు లొంగిపోయారనడానికి క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులే నిదర్శనమన్నారు.