అమర రాజా రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన‌‌‌‌‌‌‌‌

అమర రాజా రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: జీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఏరోసిటీలో  ఏర్పాటు చేస్తున్న అమర రాజా బ్యాటరీస్  రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘ఈ పాజిటివ్‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌’ కు శుక్రవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకుస్థాపన చేశారు. ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎనర్జీ స్టోరేజ్‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రిక్ మొబిలిటీ, రెన్యూనబుల్ ఎనర్జీ వంటి అంశాలపై రీసెర్చ్ చేస్తారు. ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌తో పాటు ఎవాల్వ్‌‌‌‌‌‌‌‌ పేరుతో కాన్‌‌‌‌‌‌‌‌క్లేవ్‌‌‌‌‌‌‌‌ను కూడా అమర రాజా నిర్వహించింది. కాగా,  కంపెనీ రూ.9,500 కోట్లతో   దివిటిపల్లి దగ్గర  అతిపెద్ద గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ ఫ్యాక్టరీలో లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్‌‌‌‌‌‌‌‌ను, బ్యాటరీ ప్యాక్‌‌‌‌‌‌‌‌లను తయారు చేయనుంది.