ఓల్డ్‌సిటీ, వెలుగు: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్, లక్ష్మీగూడ ప్రాంతాల్లో ఆహార కల్తీపై పోలీసులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నాసిరకంగా స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు, కుర్కురే తరహా స్నాక్స్, మిల్ మేకర్ మిశ్రమాలను తయారు చేస్తున్న మారుతి ఫుడ్స్ నిర్వాహకుడు సత్వజీ, ఇండియన్ బేకరీ అండ్ స్వీట్స్ నిర్వాహకుడు అథర్ రెహమాన్, కృష్ణ ఫుడ్ ప్రొడక్ట్స్ నిర్వాహకుడు కృష్ణ రాణి దాస్, బీఎస్ ఫుడ్ ప్రొడక్ట్స్ నిర్వాహకుడు బల్వంత్ రావును అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 2 లక్షల విలువైన కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
