నలుగురు ఆస్ట్రేలియన్లకు కరోనా

నలుగురు ఆస్ట్రేలియన్లకు కరోనా

ఇప్పడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో ...మరోసారి ఈ   ప్రాణంతాక వైరస్ పంజా విసురుతోంది. రాజస్థాన్ లో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్ నిర్ణారణ కావడం కలకలం రేపుతోంది. 

ఆస్ట్రేలియన్లకు కరోనా

ఆస్ట్రేలియా నుండి రాజస్థాన్‌ను సందర్శించడానికి వచ్చిన ఒక మహిళతో సహా నలుగురు విదేశీ పర్యాటకులకు కోవిడ్-19  పాజిటివ్ ఉన్నట్లు తేలింది. రాజస్థాన్ను సందర్శించేందుకు వచ్చిన నలుగురు ఆస్ట్రేలియన్లు..సవాయ్ మాధోపూర్లోని ఓ హోటల్ లో బస చేసినట్లు రాజస్థాన్ యూనివర్సిటీ ఫర్ హెల్త్ సైన్సెన్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సుధీర్ బండారీ తెలిపారు. నలుగురు జైపూర్ కు వచ్చారని..అక్కడ వారికి టెస్టులు నిర్వహించగా..కోవిడ్ ఉన్నట్లు తేలిందన్నారు. ప్రస్తుతం ఈ నలుగురు విదేశీయులు రాజస్థాన్ యూనివర్శిటీ ఫర్ హెల్త్ సైన్సెస్ లో  చేరినట్లు వివరించారు. ఈ నలుగురిలో ముగ్గురి పరిస్థితి సాధారణంగా ఉందని..మరో వ్యక్తి స్వల్ప లక్షణాలతో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. 

రాష్ట్రాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక

మరోవైపు దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ...కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను అలర్ట్ చేసింది. మార్చి 11వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్..అన్ని  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్-19 టెస్ట్ పాజిటివిటీ రేట్లు క్రమంగా పెరుగుతుండటంతో ....అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  కొత్త కేసులు రోజు రోజుకు పెరుగుతున్నా...ఆసుపత్రుల్లో తక్కువగానే చేరుతున్నారని చెప్పారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కోవిడ్ ప్రభావం తక్కువగా ఉందని..అయినా అప్రమత్తంగా ఉండాలన్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా  కరోనా సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు.  మూడేళ్ల క్రితం చైనాలో వెలుగు చూసిన ఈ మహమ్మారి..భారతదేశాన్ని అతలాకుతలం చేసింది. కరోనా దెబ్బకు మనదేశంతో పాటు.. ప్రపంచ దేశాల్లో లక్షలాది మంది మృత్యువాతపడ్డారు.  ఎన్నో కుటుంబాలను కోవిడ్ విచ్ఛిన్నం చేసింది. ఎన్నో జీవితాలను నాశనం చేసింది.