కరెంట్ షాక్‌‌ తో నాలుగు ఆవులు మృతి

కరెంట్ షాక్‌‌ తో నాలుగు ఆవులు మృతి

కరీంనగర్ రూరల్, వెలుగు: కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో కరెంట్‌‌  షాక్ కొట్టి నాలుగు ఆవులు స్పాట్​లోనే చనిపోయాయి. వివరాలిలా ఉన్నాయి.. బొమ్మకల్ గ్రామానికి చెందిన కోరుకంటి సత్యనారాయణకు చెందిన నాలుగు ఆవులను మేత కోసం తీసుకెళ్లాడు. నీళ్ల కోసం వాటిని వాగులోకి దించగా మానేరులో అక్రమంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ మోటర్ వైర్ల నుంచి కరెంట్‌‌  సప్లై జరిగి ఆవులు చనిపోయాయి. వాగులో అక్రమంగా మోటార్, వైర్లు వేసి ఆవుల మరణానికి కారణమైన కాల్వ శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు తమను ప్రభుత్వం ఆదుకోవాలని సత్యనారాయణ పీఎస్‌‌ లో ఫిర్యాదు చేశాడు.  

జమ్మికుంటలో రెండు బర్రెలు.. 

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో కరెంట్‌‌  షాక్‌‌ తో రెండు బర్రెలు చనిపోయాయి. మంగళవారం బర్రెలు మేత కోసం పొలాల వైపు వెళ్లాయి. పొలంలో తెగిపడిన తీగలను తాకి బర్రెలు చనిపోయాయి.