రూ. 4 కోట్లు సీజ్.. ముగ్గురు అరెస్ట్..

రూ. 4 కోట్లు సీజ్.. ముగ్గురు అరెస్ట్..

తమిళనాడు రాష్ట్రంలో భారీగా నగదు పట్టుబడింది. ఆ రాష్ట్ర రాజధాని చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్‌లో రూ. 4 కోట్ల నగదు పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే ఎన్నికల షెడ్యూల్ కొనసాగుతున్న తరుణంలో తమిళనాడు స్టేట్ అంతా అధికారులు చెక్ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే భారీగా నగదు తరలిస్తున్న సతీశ్‌ అనే వ్యక్తిని పోలీసులు చెక్ చేశారు. అతని వద్ద రూ. 4 కోట్లు పట్టుకున్నారు. అతనితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు.

 సతీశ్ హోటల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తన సోదరుడు నవీన్‌, డ్రైవర్‌ పెరుమాల్‌తో కలిసి రూ.4 కోట్ల నగదును ఆరు బ్యాగుల్లో చెన్నై నుంచి తిరునల్వేలీ వెళ్తున్నారు. ఈ క్రమంలో తాంబరం స్టేషన్‌ వద్ద ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది రైలులో తనిఖీ చేశారు. డబ్బు బయటపడటంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించడం మొదలు పెట్టారు. 

ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరుగనున్నాయి. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి.