రూ.50లకు కక్కుర్తిపడ్డ ఉద్యోగులు.. విధుల నుంచి తొలగింపు

రూ.50లకు కక్కుర్తిపడ్డ ఉద్యోగులు.. విధుల నుంచి తొలగింపు

రూ.50లకు కక్కుర్తిపడి గ్రామవాలంటీర్లు తమ ఉద్యోగాల్ని పోగొట్టుకున్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు ఏపీ సీఎం జగన్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు మెచ్చే పాలన కోసం ఉన్నతాధికారులు పలు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హాయంలో జరిగిన అవినీతి పునరావృతం కాకుండా ఉండాలని విలువైన సూచనలు అందించారు. కానీ ముఖ్యమంత్రి ఎన్ని ఆదేశాలు జారీ చేసినా పెన్షన్ల పంపిణీ విషయంలో అవినీతి జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మచిలీ పట్నానికి చెందిన నలుగురు గ్రామవాలంటీర్లు దసరా మాముళ్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మచిలీపట్నం బందరు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వాలంటీర్లు చుక్కా విజయవర్మ, లంకపల్లి ఒలివ, గాడెల్లి సునీల్ కుమార్, తెనాలి వనజలు పెన్షన్లు పంపిణీ చేసే సమయంలో ఒక్కొక్కరి నుంచి రూ.50 వసూలు చేశారు. అయితే ఈ దసరా మాముళ్లపై  ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో గ్రామ కార్యదర్శి అవినీతికి పాల్పడ్డారంటూ ఓ నివేధిక అందించారు. దీంతో మండల పరిషత్ అభివృద్ధి అధికారి GO.NO.104, గ్రామ వలంటీర్ల నియామక ఉత్తర్వులలో పేర్కొన్న విధంగా అవినీతికి పాల్పడిన సదరు నలుగురు వలంటీర్లను విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు