బ్యాంకు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా..? PNBలో ఎల్బీఓ జాబ్స్.. తెలంగాణలో ఎన్ని పోస్టులు పడ్డాయంటే..

బ్యాంకు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా..? PNBలో ఎల్బీఓ జాబ్స్.. తెలంగాణలో ఎన్ని పోస్టులు పడ్డాయంటే..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ) లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ నవంబర్ 23. 

పోస్టులు: 750. తెలంగాణ 88 (ఎస్సీ 13, ఎస్టీ 6, ఓబీసీ 36, ఈడబ్ల్యూఎస్ 13, అన్ రిజర్వ్​డ్ 38, పీడబ్ల్యూబీడీ 03), ఆంధ్రప్రదేశ్  05 (ఓబీసీ 01, అన్ రిజర్వ్​డ్ 04)  పోస్టులు ఉన్నాయి. 

ఎలిజిబిలిటీ
* గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అప్లికేషన్ సమర్పించే తేదీ నాటికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. గ్రాడ్యుయేషన్ స్థాయిలో పొందిన శాతాన్ని తప్పకుండా నమోదు చేయాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు అప్లై చేసే రాష్ట్ర స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. 
* ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో క్లరికల్/ ఆఫీసర్ కేడర్​లో కనీసం ఏడాది పోస్ట్ క్వాలిఫికేషన్  ఉండాలి.
* వయోపరిమితి: 20 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
* అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 
* అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 03.
* లాస్ట్ డేట్: నవంబర్ 23. 
* అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.59. ఇతరులకు రూ.1180. 
* సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్, లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
* ఆన్ లైన్ టెస్ట్: 2025, డిసెంబర్/ 2026 జనవరిలో నిర్వహించే అవకాశం ఉన్నది. 

పూర్తి వివరాలకుpnb.bank.inవెబ్​సైట్లో సంప్రదించగలరు.

ఎగ్జామ్ ప్యాటర్న్
ఆన్​లైన్ టెస్టులో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు (35 నిమిషాలు), డేటా అనాలసిస్ & ఇంటర్​ప్రిటేషన్ 25 ప్రశ్నలు 25 మార్కులకు (35 నిమిషాలు), ఇంగ్లిష్​ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు (25 నిమిషాలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు (35 నిమిషాలు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్​నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులకు (50 నిమిషాలు) అడుగుతారు. 
    
* నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు. 
* ఆన్​లైన్ టెస్టులో కనీస అర్హత సాధించాలంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం, రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 
* స్క్రీనింగ్ టెస్ట్: ఆన్​లైన్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల అప్లికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. 
* లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్: పదోతరగతి లేదా 12వ తరగతిలో ఒక సబ్జెక్టుగా అప్లై చేసుకున్న రాష్ట్రంలోని స్థానిక భాషను అభ్యసించని అభ్యర్థులకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్(ఎల్ఎల్​పీటీ) నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఎల్ఎల్​పీటీలో అర్హత సాధించని వారిని ఫైనల్ సెలెక్షన్​కు పరిగణనలోకి తీసుకోరు. 
* పర్సనల్ ఇంటర్వ్యూ: ఆన్​లైన్ టెస్ట్, ఎల్ఎల్​పీటీలో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూకు 50 మార్కులు కేటాయించారు. ఇందులో అర్హత సాధించాలంటే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45 శాతం(22.5 మార్కులు), ఇతరులు 50 శాతం (25 మార్కులు) సాధించాల్సి ఉంటుంది. 
* ఫైనల్ సెలెక్షన్: ఆన్​లైన్ టెస్ట్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.